: అరుణ్ జైట్లీతో భేటీ అయిన కేసీఆర్
నిన్న రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ఆర్థిక సాయంతో పాటు, ఎఫ్ఆర్ బీఎం పెంపు, కేంద్ర పథకాల్లో వాటా తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా, తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంపై వీరిరువురూ చర్చించనున్నారు.