: కాకినాడలో భారీ అగ్నిప్రమాదం... సిలిండర్లు పేలి 50 ఇళ్లు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గుడారిగుంటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో 50 ఇళ్లు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 3 ఫైరింజన్ల సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. కళ్లముందే ఇళ్లన్నీ కుప్పకూలి కాలిపోవడంతో స్థానికులు విలపిస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న హోంమంత్రి చినరాజప్ప కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.