: ఇందిరమ్మ ఇళ్లు పిట్టగోడల్లా ఉన్నాయి... మేం నిర్మించేవి గొప్పగా ఉంటాయి: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు పిట్టగోడల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్, మోతీనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఇవాళ హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు విశాలంగా, చాలా గొప్పగా ఉంటాయని చెప్పారు. అలాగే రూ.2 కోట్లతో ఫంక్షన్ హాల్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.