: రంగంలోకి చినబాబు... టీడీపీ టీచర్ల విభాగంతో నారా లోకేశ్ భేటీ


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేశారు. నిన్నటిదాకా పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త హోదాలో కాస్తంత నెమ్మదిగా అడుగులేసిన లోకేశ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రాగానే యాక్టివేట్ అయ్యారు. నిన్నటికి నిన్న విజయవాడలో ఏపీ కమిటీతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన జిల్లాలకు ఇంచార్జీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు అధ్యక్షతనే ఈ భేటీ జరిగినా, నారా లోకేశ్ అంతా తానై వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితం విజయవాడలోని పార్టీ ఏపీ కార్యాలయంలో ఆయన పార్టీ ఉపాధ్యాయ విభాగంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన రామకృష్ణతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News