: కాసేపట్లో చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబుతో కాసేపట్లో టీటీడీపీ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంపై చర్చలు జరపనున్నారు. దీంతోపాటు, తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీలకు జిల్లాల బాధ్యతలను అప్పగించడంపై కూడా చర్చించనున్నారు. మరోవైపు, టీటీడీపీ కీలక నేతలైన ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టించాయి. దీనిపై, ఇప్పటికే దృష్టి సారించిన చంద్రబాబు... ఆ సమస్యను పరిష్కరించారు.