: సంగీత్ లో స్టెప్పులతో అదరగొట్టిన దానం... కాలు కదిపిన ఎంపీ అవంతి


గ్రేటర్ కాంగ్రెస్ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ నిన్న రాత్రి స్టెప్పులతో దుమ్ము రేపారు. హిందీ హిట్ సాంగ్ లకు ఆయన వేసిన స్టెప్పులు అక్కడున్న వారిని అలరించాయి. తన పక్కనే నిలబడ్డ ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు చప్పట్లతో తనను ప్రోత్సహించడంతో మైమరచిపోయిన దానం మరింత హుషారుగా స్టెప్పులేశారు. ఏపీ మంత్రులు గంటా, నారాయణలు వియ్యంకులు కాబోతున్న విషయం తెలిసిందే. గంటా కుమారుడి పెళ్లి నారాయణ కూతురుతో ఈ నెల 30న జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. దానం నాగేందర్ స్టెప్పులను చూసిన ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా కుదురుగా నిలబడలేకపోయారు. దానంతో జత కలిసిన అవంతి కూడా స్టెప్పులేసి అలరించారు.

  • Loading...

More Telugu News