: దర్శకుడు శ్రీను వైట్లపై కేసు ఉపసంహరణ


ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లపై పెట్టిన కేసును ఆయన భార్య సంతోషి రూప ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోషి రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీను వైట్ల భార్య సంతోషి రూప వారం క్రితం హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీను వైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

  • Loading...

More Telugu News