: ఆస్తి కోసం అమ్మను, అమ్మమ్మను నరికేశాడు
ఆస్తి కోసం అమ్మను, అమ్మమ్మను నరికి చంపేసిన దారుణ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో చోటుచేసుకుంది. కిరణ్ కుమార్ తన కన్నతల్లి పుష్పలత (42), అమ్మమ్మ బాలనాగమ్మ(58)ను నరికేయడంతో వారిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. నిందితుడు కిరణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అవసరమైన సమాచారం సేకరిస్తున్నామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.