: ఇండోనేసియా, ఇంటర్ పోల్ లకు ధన్యవాదాలు: రాజ్ నాథ్ సింగ్


ఇండోనేసియా ప్రభుత్వానికి, ఇంటర్ పోల్ కు ధన్యవాదాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో మాఫియా డాన్ ఛోటా రాజన్ పట్టుపడడంపై హర్షం వ్యక్తం చేశారు. నిన్న బాలి ద్వీపంలో ఇండోనేసియా ప్రభుత్వం అరెస్టు చేేసిన వ్యక్తి ఛోటా రాజన్ అని సీబీఐ నిర్ధారించిందని ఆయన తెలిపారు. ఛోటా రాజన్ ను పట్టుకోవడం ఇంటర్ పోల్ సమర్థతకు నిదర్శనమని ఆయన చెప్పారు. 1995 నుంచి ఛోటా రాజన్ అజ్ఞాతంలో ఉన్నాడు. అతనిపై భారత్ సహా పలు దేశాల్లో కేసులున్నాయి.

  • Loading...

More Telugu News