: చోటారాజన్ అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ


మాఫియా డాన్ చోటారాజన్ ను ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేసినట్టు సీబీఐ ధ్రువీకరించింది. ఇంటర్ పోల్ అధికారుల ద్వారా తాము విజ్ఞప్తి చేయడం వల్లనే నిన్న (ఆదివారం) రాజన్ ను బాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా జకార్తాలో తెలిపారు. కాగా, అరెస్టు చేసిన రాజన్ ను భారత్ కు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా రాజన్ అరెస్టును ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News