: కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్
సాగునీటి సమస్యను వివరిద్దామంటే సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ ను బూచిగా చూపి ఓట్లు దండుకున్న సీఎం ఇప్పుడు మోహం చాటేస్తున్నారని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నదులు ప్రవహిస్తున్నా సాగునీరు అందడం లేదని చెప్పారు. జిల్లాలో వలసలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న సంపత్, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తోందన్నారు. పండుగలు, సంప్రదాయాల పేరుతో ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.