: మీరు ఎక్కడున్నా ఇంటికెవరొచ్చారో ఇట్టే తెలిసిపోతుంది!


ఇంట్లో బిజీగా ఉండగా కాలింగ్ బెల్ మోగితే చిరాగ్గా ఉంటుంది. తీరా వచ్చింది ఎవరో చూసేందుకు వస్తే, మన డోర్ ముందు ఓ సెల్స్ మెన్నో, లేక ఎవరిదో అడ్రెస్ అడగడానికి వచ్చిన వ్యక్తో అయితే కలిగే అసహనం అంతా ఇంతా కాదు. ఇకపై అలాంటి చికాకుకు స్మార్ట్ డోర్ బెల్స్ తో చెక్ చెప్పవచ్చు. వైఫైతో పనిచేస్తూ, స్మార్ట్ ఫోన్ తో అనుసంధానమయ్యే ఈ స్మార్ట్ డోర్ బెల్స్ లో హెచ్ డీ కెమెరా ఉండడం విశేషం. ఈ కెమెరా డోర్ బయట ఉన్నది ఎవరు? అనే విషయాన్ని స్పష్టంగా చూపెడుతుంది. వీటికి నైట్ విజన్ కూడా ఉండడం విశేషం. దీంతో ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా స్మార్ట్ డోర్ బెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఇంటికి వచ్చింది తెలిసిన వారా? లేక ఇంకెవరైనా? అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. మనం ఊరెళ్లినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డా కూడా ఇట్టే తెలిసిపోతుందని దీని తయారీదారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News