: భూకంపం తీవ్రత 7.7: అమెరికా జియొలాజికల్ సర్వే


ఆప్ఘనిస్థాన్ లోని ఫైజాబాద్ లోని హిందూకుష్ పర్వతాల కేంద్రంగా సంభవించిన భూకంపం 7.7 తీవ్రతతో సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం సంభవించిన అనంతరం అమెరికా జియోలాజికల్ సర్వే స్పదించింది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్ లలో భూకంప తీవ్రత ప్రభావం చూపిందని తెలిపింది. పాకిస్థాన్, భారత్ లలో పలుప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం తీవ్రత కారణంగా నష్టం పెద్దఎత్తున సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది. కాగా, భారత్ లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు భారత వాతావరణ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News