: మోదీ పేరెత్తడానికి కూడా భయపడే జగన్ మాటలను నమ్మకండి: సోమిరెడ్డి


ప్రత్యేక హోదా పేరుతో ఏపీ యువతను వైకాపా అధినేత జగన్ రెచ్చగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై జగన్ వి అన్నీ నాటకాలే అని విమర్శించారు. కనీసం ప్రధాని మోదీ పేరెత్తడానికి కూడా భయపడే జగన్... ప్రత్యేక హోదాపై ఏం పోరాటం చేస్తారని ఎద్దేవా చేశారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రత్యేక హోదాపై మోదీ ప్రకటన చేసుండకపోవచ్చని సోమిరెడ్డి అన్నారు. ఐదేళ్లలో జగన్ సంపాదించినది వెనక్కి ఇస్తే... ఉత్తరాంధ్ర, రాయలసీమలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News