: యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి: మోత్కుపల్లి
యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, యాదగిరి గుట్టను తీసుకెళ్లి అందులో కలపాలని అనుకుంటున్నట్టు తెలుస్తోందని, అలా కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు మోత్కుపల్లి మాట్లాడారు. యాదాద్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.