: అవిభక్త కవలలు వీణ-వాణీల ఆపరేషన్ బాధ్యత ప్రభుత్వానిదే!: మంత్రి లక్ష్మారెడ్డి
అవిభక్త కవలలు వీణ-వాణీల ఆపరేషన్ కు సంబంధించి ఎయిమ్స్ కు లేఖ రాశామని తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలో ఎయిమ్స్ బృందం హైదరాబాద్ వచ్చి వారిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. వీణ-వాణీల ఆపరేషన్ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు వారిద్దరి వయసు 12 ఏళ్లు దాటినందున వేరే ఆసుపత్రికి తరలించాలంటూ నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. ఏ ఆసుపత్రికి మార్చాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.