: జీతాలు కాజేసిన సైబర్ దొంగలు
జీడిమెట్ల బస్ డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్ల జీతాలను సైబర్ దొంగలు కాజేశారు. ఈ డిపోకు చెందిన నలుగురు డ్రైవర్లు, ముగ్గురు కండక్టర్ల సాలరీ అకౌంట్ల నుంచి డబ్బులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు సైబర్ దొంగలు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.