: ‘లాట్’లో లూటీ!... తిరుపతి మొబైల్ స్టోర్ లో రూ.8.5 లక్షల విలువ చేసే మొబైళ్ల చోరీ


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో నిన్న రాత్రి దొంగలు స్వైర విహారం చేశారు. నగరంలోని ‘లాట్’ మొబైల్ స్టోర్ లోకి చొరబడ్డ దొంగలు దాదాపు రూ.8.5 లక్షల విలువ చేసే మొబైళ్లను ఎత్తుకెళ్లారు. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డులో మునిసిపల్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో లాట్ మొబైల్ స్టోర్ ఉంది. దీనికి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి కాస్తంత త్వరగా విధులు ముగించుకుని ఇంటికెళ్లిపోయాడు. ఇదే అదనుగా కొందరు దుండగులు షోరూం తాళాలు పగులగొట్టి స్టోర్ లోకి చొరబడ్డారు. కంటికి కనిపించిన ఖరీదైన మొబైళ్లను ఎత్తుకెళ్లారు. నేటి ఉదయం షాపునకు వచ్చిన యజమాని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు రూ.8.5 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News