: తుళ్లూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్
ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని తుళ్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక్కడి మల్కాపురంలో అగ్నికి ఆహుతైన చెరుకు పొలాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి రైతులను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు. బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు. ఇవ్వనన్న వారి భూములు లాక్కోవద్దని అన్నారు. బలవంతంగా భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు.