: ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు: మంత్రి పోచారం జోస్యం
వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని, అయితే, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు కారకులెవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. రూ.8 వేల కోట్ల పంట రుణాలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పోచారం పేర్కొన్నారు. కాగా, వరంగల్ లోక్ సభ స్థానం ఎన్నికకు సంబంధించి ఈ నెల 28వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరితేదీ నవంబర్ 4వ తేదీ కాగా, ఉపసంహరణకు గడువు నవంబర్ 7వ తేదీ. నవంబర్ 21న వరంగల్ లోక్ సభ ఎన్నిక జరగనుంది. నవంబర్ 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది.