: వీర బాదుడు బాదుతున్న సౌతాఫ్రికా... భారీ స్కోరు దిశగా సఫారీలు


వ్యూహాలకు పదునుపెట్టి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కెప్టెన్ కూల్ శైలే వేరు. సౌతాఫ్రికాతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌలర్ ఎవరు? అన్న దానితో సంబంధం లేకుండా అందర్నీ ఊచకోతకోయడం ప్రారంభించారు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ ను పెవిలియన్ బాటపట్టించేందుకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగించుకున్నాడు. పేస్, స్పిన్ బౌలర్లను ప్రయోగించి ఫలితం రాబట్టలేక, బంతిని సురేష్ రైనా, విరాట్ కోహ్లీకి అందించాడు. వీరి బౌలింగ్ పై పెద్దగా అంచనా లేని సఫారీలు మట్టికరుస్తారని భావించాడు. అయితే సౌతాఫ్రికా ఆటగాళ్లు వారి బౌలింగ్ ను కూడా తుత్తునియలు చేయడం విశేషం. దీంతో సఫారీల స్కొరు బోర్డు రాకెట్ వేగం అందుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ డికాక్ ను రైనా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో, సౌతాఫ్రికా జట్టు కేవలం 33 ఓవర్లకే ఆమ్లా (23), డికాక్ (109), వికెట్లు కోల్పోయి డుప్లెసిస్ (71), డివిలియర్స్ (18) తో 226 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లలో మోహిత్ శర్మ, సురేష్ రైనా చెరో వికెట్ తీయడం విశేషం. సఫారీల జోరు ఇలాగే కొనసాగితే భారత్ ముందు భారీ విజయలక్ష్యం ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News