: బంగారం, వెండి ధరవరలు
మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ, ముగింపు ధరలు రూ.27,800 నమోదయ్యాయి. విజయవాడలో రూ. 27,400 వద్ద ప్రారంభమై, రూ.27,300 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో ప్రారంభం, ముగింపు రూ. 27,600 వద్ద నమోదైంది. ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.27,500 ఉంటే, ముగింపు ధర రూ.27,400 గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ. 27,200 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.27,080 వద్ద ముగిసింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.25,300 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.25,310గా ఉంది. రాజమండ్రిలో రూ. 24,115 పలకగా, విశాఖపట్నంలో 25,120తో ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.49,000 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.45,100 పలికింది.