: రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్
నీతి ఆయోగ్ సమావేశం నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం నాడు నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. డిసెంబర్ లో కేసీఆర్ చేయతలపెట్టిన చండీయాగానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసి చండీయాగంపై ఆయనతో చర్చించారు. డిసెంబర్ లో నిర్వహించే చండీయాగానికి రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు. దీంతో పాటు రాజకీయపరమైన అంశాలపై కూడా గవర్నర్, కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.