: చంద్రబాబుపై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను చంద్రబాబు సర్కారు తమవిగా ప్రచారం చేసుకుంటున్నదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, సంక్షేమ పథకాలపై కేవలం చంద్రబాబు చిత్రాన్ని మాత్రమే ప్రచురిస్తూ ఉండటం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు. పక్కనే ఉన్న తెలంగాణలో కేసీఆర్ తో పాటు మోదీ చిత్రాలను సైతం ప్రచురిస్తున్నారని, ఏపీలో అలా జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News