: ప్రస్తుతానికి నో పాలిటిక్స్: అలీ
తాను రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, ప్రస్తుతానికి మాత్రం పాలిటిక్స్ కు దూరమేనని ప్రముఖ హాస్యనటుడు అలీ అంటున్నాడు. కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో రాజకీయ పార్టీలు ఉండేవని, ఇప్పుడా పార్టీలు వర్గాలుగా మారిపోయాయని అన్నారు. తాను నటించిన చిత్రాలలో యమలీల, రాజేంద్రుడు-గజేంద్రుడు చిత్రాలు తనకెంతో ఇష్టమని వెల్లడించాడు. కొత్త సెన్సార్ నిబంధనలు అమలు కావడం, మొదలైతే, టీవీషోలన్నీ నిలిపివేసి భక్తి ప్రోగ్రాములు వేసుకోవాల్సి వస్తుందని అన్నాడు. తాను స్థాపించిన మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్టు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అలీ వివరించారు.