: బీహార్ ఎన్నికల్లో హెలికాప్టర్ల పాత్ర!
బీహార్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయపార్టీలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీహార్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మొత్తం రాజకీయ పార్టీలు 24 హెలికాప్టర్లను అద్దెకు తీసుకోగా, అందులో బీజేపీ తీసుకున్న హెలికాప్టర్ల సంఖ్య 16. ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీలు మాత్రం తలా రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని ప్రచారం నిర్వహించడం విశేషం. ఎన్నికలు తుది అంకానికి చేరుకుంటుండడంతో 5 హెలికాప్టర్లను బీజేపీ తిరిగి ఇచ్చేసింది. దీంతో చివరి దశలో బీజేపీ నేతలు 11 హెలికాప్టర్లలో తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 5న 162 నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల్లో విజయం కోసం పార్టీల నేతలు ప్రచారం నిర్వహిస్తూ శ్రమిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.