: భారతీయుడిగా మారనున్న పాక్ గాయకుడు
పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ భారతీయుడిగా మారనున్నాడు. గత కొంత కాలంగా భారత్ లో ఉంటున్న అద్నాన్ సమీ వీసా గడువు ముగిసిపోవడంతో వీసా రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్నారు. తాను భారత్ లోనే ఉండేలా అవకాశం కల్పించాలని కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన హోం శాఖ వీసాతో సంబంధం లేకుండా అద్నాన్ ఎంత కాలం కావాలంటే అంత కాలం భారత్ లో ఉండొచ్చని పేర్కొంది. తాజాగా అతనికి భారత పౌరసత్వం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపింది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు వెల్లడించింది.