: వరంగల్ అభ్యర్థి ఎంపిక విషయంపై టీటీడీపీ, బీజేపీ నేతల భేటీ


హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో ఉన్న గోల్కొండ హోటల్ లో తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీ నేతలు భేటీ అయ్యారు. టీడీపీ తరపున ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్, రేవంత్ రెడ్డి హాజరుకాగా... బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావులు హాజరయ్యారు. వరంగల్ ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై నేతలంతా చర్చిస్తున్నారు. దీంతోపాటు, ఉపఎన్నికలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు. వరంగల్ లోక్ సభ స్థానంలో తమ అభ్యర్థినే నిలబెట్టాలని ఇరు పార్టీలు భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News