: ఐరాసకు 70 ఏళ్లు... అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ


రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా పురుడుపోసుకున్న ఐక్యరాజ్యసమితికి నేటితో 70 ఏళ్లు నిండాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేస్తూ నాడు అమెరికా, రష్యా, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయానికి ప్రపంచ దేశాలన్నీ ఓటేశాయి. దీంతో అనతికాలంలోనే ఐరాస ప్రపంచ శాంతి సంఘంగా అవతరించింది. ప్రపంచంలో నెలకొన్న పలు విపత్కర పరిస్థితులను ఈ సంస్థ అత్యంత సులువుగానే పరిష్కరించగలిగింది. ఐరాసలో ఐదు అగ్రదేశాలతో పాటు భారత్ కూడా కీలక భూమిక పోషిస్తోంది. 70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఐరాసకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఐరాస చేస్తున్న కృషికి తాము ఎల్లవేళలా మద్దతుగా ఉంటామని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News