: గౌరవ సలహాదారులుగా రజనీ, కమల్?
ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్, శరత్ కుమార్ ప్యానల్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, ఉపాధ్యక్షులుగా పొన్ వన్నన్, కరుణాస్ లు, కోశాధికారిగా కార్తీ గెలుపొందారు. రేపు నూతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నడిగర్ సంఘ భవన నిర్మాణం గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, తమిళ సినీ రంగంలో తిరుగులేని హీరోలుగా కొనసాగుతున్న రజనీకాంత్, కమల్ హాసన్ లను నడిగర్ సంఘానికి గౌరవ సలహాదారులుగా బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చించనున్నారు.