: సైనా ‘టాప్’ గల్లంతు... వరుస వైఫల్యాలే కారణం


భారీ అంచనాలతో ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ లోనే బోల్తా పడింది. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న సైనా 9-21, 15-21 స్కోరుతో ఎనిమిదో సీడ్ రచనోక్ ఇంటనోన్ (థాయ్ లాండ్) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో నిన్నటిదాకా టాప్ ర్యాంకులో కొనసాగిన సైనా ఒక్కసారిగా రెండో ర్యాంకుకు పడిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ కంటే ముందు జపాన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్ లలోనూ సైనా పేలవ ప్రదర్శనతోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సిరీస్ లలో పేలవ ప్రదర్శన కారణంగా సైనా ‘టాప్’ గల్లంతైంది. ఇక రెండో ర్యాంకులో ఉన్న స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ అగ్రస్థానానికి చేరింది.

  • Loading...

More Telugu News