: బోల్తా కొట్టిన ‘దివాకర్ ’ బస్సు... 10 మందికి గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు రివాజుగా మారాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. పలువురి ప్రాణాలను హరిస్తున్న ఈ ప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రయాణికులను క్షతగాత్రులను చేసేస్తున్నాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఈ తరహాలోనే ఓ ప్రమాదం చోటుచేసుకుంది. నిండా ప్రయాణికులతో హైదరాబాదు నుంచి అనంతపురం బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ బస్సు పాలమూరు జిల్లా కొత్తూరు మండలం నందిగామ వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.