: సచిన్... కోహ్లీ.. సరిగ్గా ఇద్దరూ ఒకే వయసులో 23 సెంచురీలు!


సచిన్ టెండూల్కర్ 23 సెంచరీలు చేసిన వయసులోనే, కోహ్లీ కూడా ఇప్పుడు 23వ సెంచరీ నమోదు చేయడం కాకతాళీయమే అయినప్పటికీ ఇది ఓ విశేషమే అని చెప్పాలి. వన్డేల్లో 23వ సెంచరీ చేసే నాటికి సచిన్ వయస్సు 27 ఏళ్లు, నిన్న చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 138 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ కోహ్లీ వన్డే కెరీర్ లో 23వ సెంచరీ. ఇప్పుడు కోహ్లీ వయసు కూడా 27 సంవత్సరాలు కావడం విశేషం. మామూలుగా సచిన్ తో కోహ్లీని పోల్చే విశ్లేషకులు, దీనిని కూడా వారి మధ్య సారూప్యతగా పేర్కొంటున్నారు. కాగా, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా సచిన్ రికార్డు పుటల్లో భద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి సచిన్ రికార్డులను కోహ్లీ బద్దలుగొడతాడా? అంటూ చర్చ లేస్తోంది.

  • Loading...

More Telugu News