: సూదిగాడు మళ్లీ వచ్చేశాడు... జాగ్రత్త!


సైకో సూదిగాడు మళ్లీ రంగప్రవేశం చేశాడు. ఖమ్మం జిల్లా పాల్వంచలో సైకో సూదిగాడు కలకలం రేపాడు. దసరా సెలవుల నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సొంతూరికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్న రమ్యశ్రీ అనే యువతిని సూదితో గుచ్చి పారిపోయాడో వ్యక్తి. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో ఆగిన బస్సు కిటికీలోంచి రమ్యశ్రీని సూదితో గుచ్చి పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, సైకో సూదిగాడు చాలా కాలం తరువాత మళ్లీ తెరపైకి రావడంతో పాల్వంచ వాసులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News