: సెహ్వాగ్ తత్వం గురించి ఛాపెల్ మనసులో మాట


అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్ ఇయాన్ ఛాపెల్ తన మనసులో మాట చెప్పారు. సెహ్వాగ్ ఎవరేం చెప్పినా వింటాడని, అయితే మైదానంలో అడుగుపెట్టిన తరువాత తానేం అనుకుంటాడో అదే చేస్తాడని అన్నారు. ఛాపెల్ ను ఆటతీరు మార్చుకోవాలని సూచించానని ఆయన చెప్పారు. అలా మార్చుకుంటే సెహ్వాగ్ ఎలా అవుతాడని ఆయన తిరిగి ప్రశ్నించారు. 'ఇది నా ఆట...నేనిలాగే ఆడుతాను...దానిని మీరెలా తీసుకుంటారో మీ ఇష్టం' అని ఓసారి సూటిగా చెప్పాడని ఆయన గతం గుర్తు చేసుకున్నారు. అలా ఆడినా సక్సెస్ కావడం సెహ్వాగ్ గొప్పదనమని ఆయన చెప్పారు. సెహ్వాగ్ లో మానసిక దృఢత్వం ఎక్కువని ఆయన తెలిపారు. వీరూ బ్యాటింగ్ ను గంటల కొద్దీ ఆస్వాదించానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News