: 'డార్లింగ్' ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖులు
డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, 'బాహుబలి 2' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, నటులు రానా, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్, నితిన్, సుశాంత్, శర్వానంద్, రమ్యకృష్ణ, అనుష్క, సమంత, హన్సిక, ఛార్మి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తదితరులు ఉన్నారు.