: విశాల్ టీంకు శుభాకాంక్షలు...సహాయం కావాలంటే చేస్తా: కమలహాసన్
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విశాల్ టీంకు శుభాకాంక్షలని ప్రముఖ నటుడు కమలహాసన్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, నడిగర్ సంఘం నూతన కార్యవర్గానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. నడిగర్ సంఘంలో ఎలాంటి పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నడిగర్ సంఘం పేరును మాత్రం మార్చవద్దని ఆయన సూచించారు. నూతన కార్యవర్గం సమర్థవంతంగా పని చేస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.