: చంద్రబాబుతో గల్లా జయదేవ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. అమరావతి శంకుస్థాపన శిలా ఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం తన పేరు లేకపోవడంపై జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రధాని మోదీ ప్రసంగంపై కూడా ఆయన సూటి విమర్శలు చేశారు. దీంతో ఎంపీ తీరుపై సీఎం తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలోని అంశాలపై ఎవరూ పెదవి విప్పకపోవడం విశేషం.