: తెలుగువారికి ఎంత అదృష్టం!: కమలహాసన్


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభం కావడంపై దక్షిణాది నటుడు కమలహాసన్ స్పందించాడు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాజధానులుండటం అదృష్టమని ఆయన అన్నాడు. ఇండియాలో ఒకే భాష మాట్లాడేవారికి రెండు రాజధానులు లభించడం చాలా అరుదైన విషయమని అభిప్రాయపడ్డ ఆయన, దక్షిణాదిన ఆ ఘనత తెలుగువారికి మాత్రమే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగువారందరికీ తన అభినందనలని ఈ మధ్యాహ్నం చెన్నైలో వ్యాఖ్యానించారు. అమరావతి నగరం సుందరంగా రూపుదిద్దుకుంటుందని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టు కమలహాసన్ వివరించారు.

  • Loading...

More Telugu News