: కాపులకు ఇచ్చిన హామీలేం చేశారు?... చంద్రబాబుకు ‘ముద్రగడ’ ప్రశ్న


మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం తన స్వరం పెంచారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను ఏం చేశారని ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. కాపుల సర్వతోముఖాభివృద్ధికి పలు కీలక సంస్కరణలు చేపడతానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన ముద్రగడ, డిసెంబర్ లోగా ఆ హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ఆయన ఏపీ సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. సింగపూర్, జపాన్ మంత్రం పఠిస్తున్న సీఎం చంద్రబాబు రైతులను కూలీలుగా మార్చేస్తున్నారని ముద్రగడ విమర్శించారు.

  • Loading...

More Telugu News