: తుళ్లూరులో చెరకు తోటకు నిప్పు...అమరావతి శంకుస్థాపన స్థలికి సమీపంలో ఘటన


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కేంద్రమైన తుళ్లూరులో మరో అనుమానాస్పద ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి శంకుస్థాపన స్థలికి అతి సమీపంలోని ఐదెకరాల చెరకు తోట నిన్న రాత్రి అగ్నికి ఆహుతైంది. తుళ్లూరు మండలం మల్లాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ మరోసారి కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ కు చెందిన ఈ తోట ఎలా కాలిపోయిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో భూసేకరణ సమయంలోనే పలు తోటలు కాలి బూడిదైన సంగతి తెలిసిందే. నాటి ఘటనలపై అధికార, విపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా ఘటనకు కూడా కుట్రనే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News