: క్యాన్సర్ డయాగ్నసిస్‌లో కంప్యూటర్లే బెటర్
వ్యాధిని సరిగ్గా నయం చేయడం అంటే... సరైన డయాగ్నసిస్ చేయడమే కీలకం. సోకిన వ్యాధి, దాని మోతాదు, తీవ్రతలను కచ్చితంగా గుర్తించగలిగితే... నివారణ అనేది చాలా సులువు అవుతుంది. అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లకు జూనియర్లకు తేడా కనిపించేది కూడా డయాగ్నసిస్‌లోనే. అయితే క్యాన్సర్ వ్యాధిని డయాగ్నయిజ్ చేయడంలో కంప్యూటర్లు మనుషులకంటె కీలకంగా.. మెరుగైన సేవలు అందిస్తాయని నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక తాజా అధ్యయనం నిరూపిస్తోంది.
గతంలో క్యాన్సర్ బాధితుల జన్యుక్రమం, వారికి అందించిన చికిత్సలు, ఆ చికిత్సలకు వారి శరీరం స్పందించిన తీరు తదితర వివరాలు అన్నింటినీ... గణాంకాలను వైద్యుల సాయంతో విశ్లేషించే ప్రక్రియను వీరు రూపొందించారు. నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ హాస్పిటల్ డాక్టరు క్యారీ ఒబెరిజీ రూపొందించిన ఈ ప్రక్రియలో వ్యాధిని గుర్తించడం సులువు కావడంతో పాటూ... చికిత్స విధానాల్ని సూచించడమూ మెరుగ్గా ఉంటోందిట.