: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మోదీ
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. మోదీకి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సాదర స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ప్రధాని మోదీకి పట్టువస్త్రాలు, టీటీడీ తరపున జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.