: ఐసీసీ నిర్ణయంపై రమీజ్ రాజా ఆశ్చర్యం
టీమిండియా - సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న సిరీస్ లో భాగంగా నాలుగు, ఐదు వన్డేల నుంచి పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కి పిలిచింది. దీనిపై పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అలీం దార్ ను ఐసీసీ ఎందుకు వెనక్కి పిలిపించిందో అర్థం కావడం లేదని అన్నాడు. భద్రతాపరమైన కారణాలుంటే, సెక్యూరిటీని పెంచాలని బీసీసీఐని అడిగితే సరిపోయేదని చెప్పాడు. వాస్తవానికి, బీసీసీఐ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించిన నేపథ్యంలో అలీం దార్ ను ఐసీసీ వెనక్కి పిలిపించింది.