: రేణిగుంట విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్ ప్రారంభించిన మోదీ


చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర్లోని రేణిగుంట విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అమరావతి శంకుస్థాపన అనంతరం రేణిగుంట చేరుకున్న ఆయన అంతర్జాతీయ టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ టెర్మినల్ ద్వారా 300 మంది స్వదేశీ, 200 మంది విదేశీ ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రయాణించే సౌలభ్యం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, తిరుపతి బాలాజీని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు వస్తారని అన్నారు. వారి సౌకర్యార్థం అన్ని హంగులు రేణిగుంట విమాశ్రయంలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తాజా టెర్మినల్ మరింతమంది భక్తుల అవసరాలు తీరుస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఇలా ప్రయాణించిన భక్తులందరికీ బాలాజీ ఆశీస్సులు ఉంటాయని ఆయన ఆకాంక్షించారు. ఈ టెర్మినల్ ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News