: ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధం: జపాన్ మంత్రి తకాగి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ మంత్రి తకాగి తెలిపారు. అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు జపాన్ సిద్ధంగా ఉందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతుల కల్పన... ఇలా ఏ అంశంలో సాయం కావాలన్నా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News