: చంద్రబాబు ప్రసంగానికి చప్పట్లు కొట్టిన నరేంద్ర మోదీ


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి ప్రసంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ అమరావతి గొప్పదనాన్ని వివరించారు. దేశంలోని వివిధ పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని, పుణ్య నదుల నీటిని అమరావతి వ్యాప్తంగా తానే స్వయంగా చల్లానని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానిని ప్రస్తావిస్తూ అమరావతిని తప్పనిసరిగా విజయంతం చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. దీనికి ముగ్ధుడైన ప్రధాని చప్పట్లు కొట్టి మరీ చంద్రబాబు ప్రసంగానికి మరింత జోష్ పెంచారు. అంతేకాక అమరావతికి ఉన్న సౌలభ్యాలు, తాము చేపడుతున్న చర్యలను చంద్రబాబు చెప్పినప్పుడు కూడా మోదీ చప్పట్లు కొట్టారు.

  • Loading...

More Telugu News