: మోదీ మాట ఇచ్చారు, అమరావతి విరాజిల్లుతుంది... ఇద్దరు చంద్రులు కలవడం ఆనందదాయకం: వెంకయ్య
'నేను సైతం అమరావతికి...' అంటూ ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి మట్టి, యమున నుంచి నీటిని తీసుకురావడం... అమరావతి భవిష్యత్తు గురించి చెప్పకనే చెబుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ చెప్పిన మాటతో అమరావతికి ఆయన ఏం చేయబోతున్నారు? అనే విషయం అర్థమవుతోందని అన్నారు. అమరావతి విరాజిల్లడం ఖాయమని చెప్పారు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు అమరావతి కోసం కలసిపోవడం చాలా ఆనందదాయకం అని వెంకయ్య చెప్పారు. ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును సూచిస్తోందని చెప్పారు. ఇద్దరూ ఇదే విధంగా సహాయ, సహకారాలతో ముందుకు వెళ్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో దూసుకుపోవడం ఖాయమని చెప్పారు.