: అమరావతి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మోదీ
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. శిలాఫలకంపై పెద్ద అక్షరాలతో అమరావతి - ది పీపుల్స్ క్యాపిటల్ అని రాసి ఉంది. శిలాఫలకంపై ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరుల పేర్లు ఉన్నాయి. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన వెంటనే వీరంతా సభా వేదిక వద్దకు బయలుదేరారు.