: అమరావతిలో బాలయ్య సందడి
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతిలో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక పైకి ఎక్కి కార్యక్రమానికి హాజరైన అందరికీ అభివాదం చేశారు. అంతకు ముందు తన మనవడు నారా దేవాన్ష్ ను ఎత్తుకుని ముద్దాడుతూ గడిపారు. ఈ సందర్భంగా బాలయ్య చుట్టూ పలువురు మంత్రులు, నేతలు గుమిగూడారు. మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత కూడా దేవాన్ష్ ను ఎత్తుకుని ముద్దాడారు. మొత్తం మూడు బస్సుల్లో ఎన్టీఆర్ కుటుంబమంతా అమరావతికి తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హ్యాపీ మూడ్ లో కనిపించారు.